అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
తాత్పర్యము : అప్పులిచ్చు వాడును, వైద్యుడును, యెడతెగకుండా నీరు పాఱుచుండెడి నదియును, బ్రాహ్మణుడును--ఇవి యున్న యూరిలోనే నివసింపుము. ఇవి లేని యూరున ప్రవేశింపకుము.
