౯. ఆఁకొన్న కూడె యమృతము...

ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్,
సో కోర్చువాఁడె మనుజుఁడు,
తేఁకువగలవాడె వంశ తిలకుఁడు సుమతీ.

తాత్పర్యము : ఆకలిగా నున్నప్పుడు తిన్న యన్నమే అమృతము వంటిది. వెనుక ముందు లాడక నిచ్చువాఁడేదాత. కష్టములు సహించువాడే కులమునందు శ్రేష్ఠుడు.