ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ.
తాత్పర్యము : ధనము నిచ్చునదే విద్య, యుద్ధభూమిలో చొరబడునదే పౌరుషము. గొప్ప కవులుగూడ మెచ్చునట్టిదే నేర్పరితనము. తగువునకు వచ్చుటయే చెఱుపు.
౧౦. ఆఁకలి యుడుగని కడుపును...
ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాఁకొన్న నూతి యుదకము
మేకల పడియును రోఁత మేదిని సుమతీ.
తాత్పర్యము : ఆకలి తీరని భోజనము, గర్భము ధరించిన యుంపుడుకత్తెతో పొందును, ప్రాతబడిన బావి నీరును, మేకల పొడియును అసహ్యకరము.

౯. ఆఁకొన్న కూడె యమృతము...
ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్,
సో కోర్చువాఁడె మనుజుఁడు,
తేఁకువగలవాడె వంశ తిలకుఁడు సుమతీ.
తాత్పర్యము : ఆకలిగా నున్నప్పుడు తిన్న యన్నమే అమృతము వంటిది. వెనుక ముందు లాడక నిచ్చువాఁడేదాత. కష్టములు సహించువాడే కులమునందు శ్రేష్ఠుడు.

౮. అల్లుని మంచితనంబును,..
అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యముఁ,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ.
తాత్పర్యము : అల్లుఁడు మంచిగా నుండుట, గొల్ల విద్వాంసుఁడౌట, ఆడుది నిజము చెప్పుట, పొల్లున - దంచిన బియ్యము, తెల్లని కాకులును లోకములో లేవని తెలియవలయును.

౭. అప్పిచ్చువాడు, వైద్యుడు,...
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
తాత్పర్యము : అప్పులిచ్చు వాడును, వైద్యుడును, యెడతెగకుండా నీరు పాఱుచుండెడి నదియును, బ్రాహ్మణుడును--ఇవి యున్న యూరిలోనే నివసింపుము. ఇవి లేని యూరున ప్రవేశింపకుము.

౬. అప్పుగొని చేయు విభవము...
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
ద ప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ.
తార్పర్యము : అప్పుచేసి చేయు వేడుకయు, ముసలితనమందు పడుచు పెండ్లామును, మూర్ఖుడు చేయు తపమును, తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యమును - సహింపరానివై, తరువాత చెడును గలిగించును.

౫. అధరము కదలియుగదలక...
అధరము కదలియుగదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ,
నధికార రోగపూరిత
బధిరాంధిక శవముజూడ బాపము సుమతీ.
తార్పర్యము : పెదవి కదలెనో లేదో తెలియని విధమున, మంచి మాటలను మాని, అధికార మనెడి రోగముచే పలుకకుండుటయే నియమముగా గల్గినటువంటి అధికారి-కన్నుల చూడక, చెవుల వినక, పెదవి కదల్చక యుండు పీనుగునకు సమానమే యగుటచేత, అట్టి అధికారిని చూచినంతనే పాపము కలుగును.

౪. అడియాస కొలువు గొలువకు...
అడియాస కొలువు గొలువకు
గుడిమణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవిని దో డరయ కొంటి నరుగకు సుమతీ.
తాత్పర్యము : వ్యర్థమైన ఆశగల కొలువును, దేవాలయ మండలియధికారమును, చెడ్డవారితో విడువకుండా స్నేహమును, అడవిలో తోడు లేకుండగా ఒంటరిగా పోవుటయును తగినవికావు. (కనుక, వానిని మానివేయవలెను.)

౩. అడిగిన జీతం బియ్యని...
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.
తాత్పర్యము : అడిగిన జీతమీయని ప్రభువుని సేవించి కష్టపడుట కన్న చురుకైన యెద్దులను గట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు.

౨. అక్కరకురాని చుట్టము,...
అక్కరకురాని చుట్టము,
మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ.
తాత్పర్యము : సమయమునకు సహాయము చెయని చుట్టమును, నమస్కరించినను వరమునీయని దైవమును, యుధ్ధములో తానెక్కగా పరుగెత్తని గుఱ్ఱమును వెంటనే విడువవలయును.

೧. శ్రీరాముని దయచేతను...
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.
తాత్పర్యము : ఓ మంచి బుధ్ధిగలవాడా! శ్రీరామచంద్రుని కృపచేత, సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిధ్ధమైన ధారాళమైన నీతులను, వినువారికి నోరూరించునటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను.

Subscribe to:
Posts (Atom)